Listen to this article

జనం న్యూస్ 23 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

మండలంలోని బిరసాడ వలస గ్రామంలో గల కోళ్ల ఫారం వద్ద ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిపై రెవెన్యూ శుక్రవారం కోరడ జుల్లు కనిపించింది. కోళ్ల ఫారం ప్రారంభం నుండి ప్రభుత్వ భూమిని సుమారు 1.13 సెంట్లు ను ఆక్రమించుకుని చుట్టూ గోడ నిర్మించి అనుభవిస్తున్నారు. కోళ్ల ఫారం తో పాటు చుట్టుప్రక్కల మరో కొంతమంది సుమారు మూడు ఎకరాల 55 సెంట్లు భూమిని ఆక్రమించుకుని అనుభవిస్తుండగా గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రెవిన్యూ శాఖ స్పందించి తక్షణ చర్యలు చేపట్టి ఆక్రమణ లో ఉన్న గోడను జెసిబి సహాయంతో కూలగొట్టి ప్రభుత్వ భూమిని స్వాధీనపరచుకున్నారు. గ్రామ సరిహద్దుల్లో విలువైన ప్రభుత్వ భూములను కొందరు వ్యక్తులు అనధికారకంగా ఆక్రమించి ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులు మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఆక్రమణలు జరగకుండా తగు చర్యలు చేపట్టి ప్రభుత్వ భూములను కాపాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు ఆర్ ఐ శ్రీనివాసరావు, వీఆర్వో అప్పలనాయుడు పాల్గొన్నారు.