

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ ) పర్యవేక్షణలో ఈ రోజు (23/8/25) గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కేంద్రం గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నందు చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ప్రాజక్ట్ విద్యార్థులకు ఇంటెన్సీఫైడ్ ఐ ఈ సి క్యాంపెయిన్ 2025 ద్వార ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమములో జోనల్ సూపర్వైజర్ బి నాగేశ్వరరావు మాట్లాడుతూ యువకులు హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అప్రమత్తంగా గా ఉండాలి అనీ లైంగికంగా అంటించుకొనే వ్యాధి అని,అంటువ్యాధి కాదని అలాంటి వారిని ప్రేమతో ఆదరించాలని వారిపై చిన్నచూపు వివక్షత చూపరాధని వివరించారు
తరువాత హెచ్ఐవి ఎయిడ్స్ అంటే ఏమిటి ఎన్ని విధాలుగా వస్తుంది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి మరియు యాంటీ రిట్రో వైరల్ తెరఫీ మందులు గురించి వివరించారు అదేవిధంగా విద్యార్థులు చదువుతో వ్యక్తి గత శుభ్రత పట్ల శ్రద్ధ వహించి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా చిన్న వయసులోనే (డ్రక్సూ )మాదక ద్రవ్యాలకు అలవాటుపడి మానసికముగాను ఆరోగ్యంగాను పాడుచేసు వారి జీవితాలలో తల్లీ దండ్రులకు కన్నీరు మిగుల్స్తున్నారు అని చూచించారు ఈ కార్యక్రమంలో కళాలశాల ప్రిన్సిపల్ డా: వి శ్రీదేవి సిబ్బంది యం విజయకుమార్, ఏడుకొండల రావు, లక్షమన్ రావు రవికుమార్ , రామ సుబ్బులు , గణేష్ కస్టర్ లింక్ వర్కర్స్ గాయిత్రి, జాన్ బనియన్ విద్యార్థులు పాల్గొన్నారు