

బిచ్కుంద ఆగస్టు 23 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటామస్ బిచ్కుందలోని పి జి మొదటి విద్యార్థులు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. .ఎం.ఎ తెలుగు, ఎం.ఎ ఆంగ్లం, ఎం.కం విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కే. అశోక్ విద్యార్థులను ఉద్దేశిస్తు ప్రసంగిస్తూ విద్యార్థులు సెట్ ,నెట్ పరీక్షలు రాసి పరిశోధన రంగాలలో రాణించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పి.జి.కోఆర్డినేటర్ టి.సంతోష్ మరియు కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థులు శ్రీనివాస్ పటేల్ సిద్ధార్థ్ పాల్గొన్నారు.

