Listen to this article

– ఫలించిన ప్రణవ్ వ్యహం,కమిటీ నియామకంపై తనదైన శైలిలో వ్యూహరచన..
– మూడేళ్ల తర్వాత కొలువుదీరిన నూతన పాలకవర్గం..
– కమిటీకి సహకరించిన మంత్రులు ఉత్తమ్,పొన్నం,తుమ్మల,ఇంచార్జి ప్రణవ్ కు కృతజ్ఞతలు తెలిపిన పాలకవర్గం..
– రైతులకు,ప్రభుత్వానికి వారధిగా ఉండాలని ప్రణవ్ సూచన.
జనం న్యూస్ //జనవరి //28//జమ్మికుంట //కుమార్ యాదవ్:- ఎప్పుడు ఎప్పుడా అనీ ఎదురుచూస్తున్నటువంటి జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం మంగళవారం రోజున పదవి బాధ్యతలు స్వీకరించారు.ఆసియా లో రెండవ అతిపెద్ద మార్కెట్ గా పేరుగాంచిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం కొలువుదీరింది.జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి డి.ప్రకాష్ ఈ కార్యక్రమానికి హాజరై పదవీస్వీకరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.అనంతరం మార్కెట్ చైర్మన్ గా పుల్లూరి స్వప్న-సదానందం,వైస్ చైర్మన్ ఎర్రంరెడ్డి సతీష్ రెడ్డి,డైరెక్టర్లుగా కామిడి శ్రీపతి రెడ్డి,నల్లగోని సతీష్,మాదాసి సునీల్,నాయినేని రాజేశ్వరరావు,తాళ్లపల్లి శ్రీనివాస్,ఎగ్గేటి సదానందం,మనుపటి సురేష్,గడ్డం దీక్షిత్,ఉప్పల శ్రీనివాస్ రెడ్డి,ఎండి రషీద్ పాష,కందల తిరుపతి,దొడ్డ శ్యామ్ కుమార్,కటంగూరి శ్రీకాంత్ రెడ్డి నియమితులయ్యారు.ఈ సందర్భంగా నూతన కమిటీకి వోడితల ప్రణవ్ అభినందనలు తెలియజేశారు.రైతులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ,రైతు సమస్యలే ప్రధాన అజెండాగా ముందుకు వెళ్లాలని,మార్కెటింగ్ వ్యవస్థ పై మరింత నమ్మకం కలిగించేలా పాలకవర్గం పనిచేయాలని,మార్కెట్ కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

*రైతుల సంక్షేమానికి కృషి చేస్తా..స్వప్న సదానందం

తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైతులకు మరింత సేవ చేస్తానని నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న-సదానందం అన్నారు..భాద్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు కాంగ్రెస్ లో న్యాయం చేస్తారని,నాపై నమ్మకం ఉంచి ఈ పదవీ బాధ్యతలు ఇచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా అద్యక్షుడు మానకొండూర్ శాసన సభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ,హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మార్కేట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేషం,గ్రేడ్ టూ కార్యదర్శి రాజా,మార్కేట్ సిబ్బంది,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అధిరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.