జనం న్యూస్ ఆగష్టు 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై మండల్ డిప్యూటీ తహసిల్దార్ జి ప్రభావతి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాల్ పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ చందుపట్ల కీర్తి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాయంపేట మండల కేంద్రంనుండి ఆత్మకూరు కు వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా గతంలో కొత్త రోడ్డు నిర్మాణంనానీకై రోడ్డుకు ఇరువైపులా ఉన్నమ్మ మురుగు కాలువలను చెడ చెడగొట్టి ఇప్పటివరకు ఇప్పటివరకు నిర్మించకపోవడం వల్ల వర్షాకాలంలో వ్యాధులు ప్రబలిలే అవకాశం ఎక్కువగా ఉంటాయి కనక వెంటనే నిర్మాణం చేపట్టాలని గత ప్రభుత్వం ధరణి ద్వారా పరిష్కారం చేయలేని భూ సమస్యలను కొత్తగా రూపొందించిన భూభారతి చట్టం ద్వారా పరిష్కరిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు గ్రామాలలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించకపోవడం చాలా విడ్డూరమని గ్రామాలలో కోతులు కుక్కలు ద్వారా బడికి వెళ్లే విద్యార్థులపై వృద్ధులపై యువకులపై దాడి చేయడం ద్వారా రోజుకు ఎంతోమంది గాయపడుతున్నారని కోతులను కుక్కలను జంతు సంరక్షణశాలకు పంపియాలని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి 20 నెలలు దాటినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాలలో అభివృద్ధి కుంటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలతోనే కాలాన్ని వెల్లదీస్తుందని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి అభ్యర్థులకే ఓట్లు గెలిపించాలని కోరారు ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి, జిల్లా ఉపాధ్యక్షురాలు కోడేపాక స్వరూపజిల్లా ప్రధాన కార్యదర్శి తాటికొండ రవికిరణ్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజు, సీనియర్ నాయకులు బూర ఈశ్వరయ్య, బత్తుల రవి, మండల ఉపాధ్యక్షుడు కోమటి రాజశేఖర్, మండల కార్యదర్శి మేకల సుమన్, మండల కోశాధికారి కుక్కల మహేష్, మండల సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్, భూత్ అధ్యక్షులు కడారి చంద్రమౌళి, పైడిమల్ల సుధాకర్, మంద మధు, కన్నెబోయిన రమేష్, ఎర్ర తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు…


