Listen to this article

విజయనగరం వన్ టౌన్ సిఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి||

జనం న్యూస్ 25 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్స్ క్వార్టర్స్ నందు 23-8-2025న గుర్తు తెలియని మృతదేహం లభ్యమయిందన్నారు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారుగా 40 – 50 సంవత్సరాల మధ్య ఉండవచ్చని 1వ పట్టణ సిఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిసినట్లయినా, మృత దేహాన్ని గుర్తించినట్లయినా సమాచారాన్ని 9121109419 కు అందించాలని 1వ పట్టణ సిఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి కోరారు.