Listen to this article

జనం న్యూస్ 25 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం జిల్లా హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజలకు ఉచితంగా వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు పట్టణంలోని కోట జంక్షన్ వద్ద, ఆర్ అండ్ బి జంక్షన్ వద్ద,రైతు బజార్ వద్ద ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేసి పంపిణీ కార్యక్రమం చేపట్టారు. నాలుగు వేలకు పైచిలుకు విగ్రహాలను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన జి. శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు వై.బాబురావులు హాజరయ్యారు. జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి.వాసు, కార్యదర్శి కాళ్ళ సునీల్, కోశాధికారి కే. చైతన్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామన్నారు. తమ అసోసియేషన్ తరపున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.