బిచ్కుంద ఆగస్టు 25 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం పిలుపుమేరకు బిచ్కుంద మండల రేషన్ షాప్ డీలర్లు తన న్యాయమైన డిమాండ్ల కోసం బిచ్కుంద తాసిల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. గత ఐదు నెలల నుండి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ నెలలకు సంబంధించిన కమిషన్ విడుదల కాకపోవడం వల్ల రేషన్ డీలర్లు అప్పుల పాలై ఎంతో ఆవేదనకు గురవుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చొరవ తీసుకొని రేషన్ డీలర్లకు వెంటనే కమిషన్ విడుదల చేయాలని తాసిల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. స్టేట్ కమిషన్ రాష్ట్ర కమిషను అని విడివిడిగా కాకుండా రెండు కలిపి ఒకేసారి చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ డీలర్లకు 5000 గౌరవ వేతనం 300 కమిషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఈ హామీని కూడా నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం


