

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 25 ( జనం న్యూస్ ప్రతినిధి)
బీసీ రిజర్వేషన్ పితామహుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిందేశ్వర ప్రసాద్ మండల్ జయంతి సందర్భంగా తెలంగాణ జన సమితి పార్టీ తరఫున ఘనంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మల్లెల రామనాథం మాట్లాడుతూ
“మహానీయుడు బి.పి. మండల్ గారు సామాజిక అసమానతలను నిర్మూలించి, దేశంలో 50 శాతం పైబడిన బీసీల అభివృద్ధి కోసం జీవితాంతం శ్రమించారు. కోర్టులు, కుట్రలు, కుతంత్రాలు ఎదురైనా వెనకబడిన వర్గాల అభివృద్ధి కోసం శాస్త్రీయ రీతిలో 40కి పైగా సిఫారసులు చేస్తూ, మండల్ కమిషన్ ద్వారా రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం చేశారు. నేడు బీసీలకు లభిస్తున్న రిజర్వేషన్లు ఆ మహానీయుని కృషి ఫలితమే” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మల్లెల రామనాథం తో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు తిప్పన సిద్ధులు, జిల్లా కార్యదర్శి పగడాల కర్ణాకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సురకంటి ప్రభాకర్, మూల నాగిరెడ్డి, పుల్లయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొని బి.పి. మండల్ కి నివాళులర్పించారు.