జనం న్యూస్ ఆగస్టు 24 ముమ్మిడివరం ప్రతినిధి
కాట్రేనికోనలో కామేశ్వరి మెడికల్ స్టోర్స్ ప్రక్కన ఆణివిళ్ళ కృష్ణమూర్తి ప్రాంగణంలో డా.ఆణివిళ్ళ కాశ్యప్ సహకారంతో డా. వెన్నా హరీష్ పర్యవేక్షణలో ఉచిత వినికిడి పరీక్షలు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయింత్రం 5 గంటల వరకు నిర్వహించారు. ఈ శిబిరంలో 30 మంది వరకు వినికిడి సమస్య ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. శిబిరం పుర్తయిన అనంతరం డా. ఆణివిళ్ళ కాశ్యప్ మరియు డా.వెన్నా హరీష్ ని ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి దుశ్శాలువతో ఘనంగా సత్కరించి, ప్రశంసా పత్రం, మొమెంటో అందజేసారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు చల్లా గోపీ, గ్రంథి ప్రసాద్, పెద్దింటి వ్యాసమూర్తి పాల్గొన్నారు.


