బిచ్కుంద ఆగస్టు 25 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటామస్ బిచ్కుందలోని మొదటి సంవత్సర విద్యార్థులకు ద్వితీయ , తృతీయ సంవత్సర విద్యార్థుల వెల్కమ్ పార్టీ ని ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ కే. అశోక్ విద్యార్థులను ఉద్దేశిస్తు ప్రసంగిస్తూ మన కళాశాల దినదినాభివృద్ధి చెందుతూ జిల్లా స్థాయి కళాశాల లతో పోటి పడుతూ పూర్తిస్థాయి విద్యార్థులతో సకల సౌకర్యాల తో మన కళాశాల రాష్ట్రస్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. తెలంగాణ యువజన కాంగ్రెస్ నాయకుడు కే. విజయభాస్కర్ రెడ్డి విద్యార్థుల కు భోజన సౌకర్యం కల్పించి, కళాశాల అభివృద్ధికి తాము తమ నాయకుడు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




