Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- కీర్తి రూరల్ డెవలప్మెంట్ తరఫున బాధితులకు దుప్పట్లు నూతన వస్త్రాలు అందజేసిన.. మద్దుల ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవ ధర్మం అటువంటి వారిని ఆదుకోవడంలోనే జీవితానికి సార్ధకత అన్నారు కీర్తి రూరల్ డెవలప్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షులు మద్దుల వెంకట కోటయ్య యాదవ్ ఈపూరు మండలం వనికుంటలో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధితులను సోమవారం ఆయన పరామర్శించారు. వనికుంటలో గతవారం జరిగిన అగ్నిప్రమాదంలో బచ్చనబోయిన ఆంజనేయులు, షేక్ నన్నేసాలకు చెందిన 3 పూరిళ్లు దగ్ధం అయ్యాయి. అగ్నిప్రమాదంలో కాలిపోయిన ఇళ్లు పరిశీలించారు. అగ్నిప్రమాదం చాలా దురదృష్టకరమని, వీరికి ప్రభుత్వం అండగా ఉండి పక్కా గృహాలు నిర్మించాలని బాధితులకు వెంటనే లక్ష రూపాయలు నష్టపరిహారం అందజేయాలని కోరారు. అగ్ని ప్రమాద బాధితులకు దుస్తులు, దుప్పట్లు అందించారు. అగ్నిప్రమాదంలో నిరాశ్రయులైన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అందించాల్సిన ఆర్థిక సాయాన్ని త్వరగా అందజేయాలని డిమాండ్ చేశారు .