జనం న్యూస్ ఆగస్టు 25 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
మియాపూర్ ఆల్విన్ కాలనీ చౌరస్తా దగ్గరలో ఉన్న శ్రీ హేమ దుర్గ అమ్మవారి దేవస్థానం 25వ వార్షిక ఉత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారినీ ఆలయాన్ని పూలమాలతో, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.రమేష్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు హోమాలు నిర్వహించారు.భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు.



