Listen to this article

.. జనం న్యూస్ ఆగష్టు 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం ప్రత్తి, కంది, వరి మొక్కజొన్న పంటలను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్ శాస్త్రవేత్తలు పంటలను పరిశీలించారు ఇందులో ప్రధానంగా ప్రత్తి పంటలో టొబాకో స్ట్రీక్ వైరస్ లేదా తలమాడు తెగులుకు సంబంధించిన కారకాలు తామర పురుగులు , పేను బంక గమనించి వీటి ద్వారా ఈ తెగులు వ్యాప్తి జరుగుతుంది అందువలన రైతులు వీటి నివారణకు గాను ఇమిడా క్లోపరిడ్ ఐదు మిల్లీలీటర్లు లేదా తయామితాక్స మ్ 0.2 మిల్లీలీటర్లు లేదా పిప్రోనిల్ రెండు మిల్లీలీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి అలాగే కంది పంటలో గొడ్డు మోతు తెగులు అక్కడక్కడ గమనించి దీని నివారణకు గాను నీటిలో కరిగే గంధకము మూడు గ్రాములు ఒక్క లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. రైతులు తప్పనిసరిగా చీడపీడను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ తగిన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే చీడపీడల భారి నుండి పంటలను కాపాడుకోవచ్చు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ రాములు, డాక్టర్ గోనియా నాయక్, డాక్టర్ పద్మజ, డాక్టర్ మధు పరకాల ఏడిఏ ఎస్ శ్రీనివాస్ మండల వ్యవసాయ అధికారి గంగా జమున వ్యవసాయ విస్తరణ అధికారి అర్చన అధికారులు రైతులకు తగు సూచనలు తెలియజేశారు…..