జనం న్యూస్- ఆగస్టు 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీ లో స్థానిక సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పెదవుర మండల కార్యదర్శి దుబ్బ రామచంద్రయ్య మాట్లాడుతూ పైలాన్ కాలనీ ఎండి టైప్ క్వార్టర్స్ లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ సరిగా లేదని, ప్లాస్టిక్ కవర్ల పై నిషేధం అంతంత మాత్రమేనని, పారిశుద్ధ్య నిర్వహణలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రోజు చెత్త తీసుకు వెళ్లడానికి మున్సిపల్ వాహనాలు వీధుల్లోకి రావట్లేదని కుక్కల స్వైర విహారం అధికంగా ఉందని, పారిశుద్ధ్య నిర్వహణ లోపంతో ప్రజలు రోగాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలలో కోతులు మరియు వీధి కుక్కల బెడద అధికంగా ఉందని వీటి నిర్మూలనకు తగిన చర్యలు త్వరితగతిన తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. సమస్యలపై స్పందించని యెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు గోవింద్, ఆనంద్ పాల్, చుక్కా రమేష్, కృష్ణ, రోశయ్య, తదితరులు పాల్గొన్నారు.


