Listen to this article

జనం న్యూస్ ;25 ఆగస్టు

సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్: శ్రీవాణీ స్కూల్ భారత్ నగర్ సిద్దిపేటలో సోమవారం రోజున వినాయక చవితి ముందస్తుగా విద్యార్థులు మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను తీసుకువచ్చి ప్రదర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సి.హెచ్ సత్యం మాట్లాడుతూ “పర్యావరణం పరిరక్షణ” అనే కాన్సెప్ట్‌ను విద్యార్థులకు పరిచయం చేశారు. కెమికల్ విగ్రహాలు వలన నీటి కాలుష్యం ఏర్పడుతుందని, పర్యావరణానికి హాని జరుగుతుందని ఉపాధ్యాయులు వివరించారు. మట్టి వినాయకులు మాత్రమే ఉపయోగించాలని, ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని విద్యార్థులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నవీన్ కుమార్ ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.