Listen to this article

బిచ్కుంద ఆగస్టు 26 జనం న్యూస్

25.08.2025 సోమవారం నాడు కూకట్పల్లి కోర్టు పరిధిలోని కోర్టు కేసు పనిమీద వెళ్ళిన న్యాయవాది తన్నీరు శ్రీకాంత్ గారి మీద ప్రతిపక్ష పార్టీ వ్యక్తులు కట్టెలతో మరియు తదితర వస్తువులతో అన్యాయంగా, దౌర్జన్యంగా దాడి చేసినందుకు ఇట్టి దాడిని బిచ్కుంద న్యాయవాదులు తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేసినారు. రాబోయే కాలంలో ఇట్టి దాడులు పునరావృతం కాకుండా దాడి చేసిన వ్యక్తుల మీద, అలాగే వారిని సహకరించిన వ్యక్తుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ.ప్రకాష్, జనరల్ సెక్రటరీ ఈ. శివాజీ, ఉప అద్యక్షులు రాజేష్ డెస్ముక్, న్యాయవాదులు యం.లక్ష్మణ్ రావు, టీ. విఠల్, జి. మల్లేశ్వర్, ఏ. విఠల్ రావు, షేఖ్ మొహమ్మద్, పి.రవి తదితరులు పాల్గోన్నారు.