Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

స్థానిక ఆల్విన్ కాలనీ డివిజన్ ఆల్విన్ కాలనీ ఫేస్ 2 ధరణి నగర్ లో గల సాంస్కృతిక సేవా సమితి వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుని ప్రతిమలను పంపిణీ చేయుటకు కాంగ్రెస్ పార్టీ శేర్లింగంపల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ శిరీష సత్తూర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మన పర్యావరణాన్ని కాపాడుకోవడం మనకు చాలా అవసరమని, కాలుష్య రహిత మట్టి వినాయకులను పూజిస్తూ మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడం మన బాధ్యతని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, శ్రీకాంత్ చారి, సాయి ప్రభాకర్, రమేష్, వివేక్, సమ్మారెడ్డి లహరి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.