జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 26
తర్లుపాడు మండలం జగన్నాధపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగన్ బాబు పాఠశాలలో విద్యార్థులు త్రాగుటకై పడుతున్న ఇబ్బందులను చూసి దాతల సహకారంతో 15000 రూపాయల విలువ గల ఆక్వా గార్డ్ ని బిగించడం జరిగింది. ఒంగోలు వాస్తవ్యులు బొగ్గవరపు జయ రామారావు వారి శ్రీమతి సరోజినీ ఇందుకు సహకరించారు. మనకున్న దానిలో నిరంతరం సేవ చేయాలని ఉద్దేశం గల దంపతులు వారు. సమస్య చెప్పగానే వెంటనే స్పందించి తెచ్చి బిగించమని తెలియజేశారు. చదువుకునే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడమని తెలియజేశారు. ఈ సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి అచ్యుత సుబ్బారావు మాట్లాడుతూ జగన్ ఎక్కడున్నా కూడా ఏ స్కూల్లో పనిచేసిన కూడా నిరంతరం పాఠశాలకు, పిల్లల అభివృద్ధికి తోడ్పడుతుంటాడని అభినందించారు. తను పని చేస్తున్న ప్రతి స్కూల్లో విద్యార్థులను విద్యావంతులుగా చేయడమే కాకుండా వారికి అవసరమైన వస్తువులన్నీ తన సొంత నిధులతో అందించడం గొప్ప విషయం. అలాగే సామాజిక బాధ్యతతో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అని తెలియజేశారు. పాఠశాల పట్ల, విద్యార్థుల పట్ల జగన్ చూపుతున్న చొరవని గ్రామస్తులు తల్లిదండ్రులు అభినందించారు.. ఈ కార్యక్రమంలో మిషన్ ని మండల విద్యాశాఖ అధికారి ఏ సుబ్బారావు మరియు తుమ్మలచెరువు కాంప్లెక్స్ చైర్మన్ వై శ్రీనివాసరావు టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు సార్ మాట్లాడుతూ జగన్ సార్ గొప్ప సామాజిక కార్యకర్త అంటూ ,ఈ మధ్యనే తుమ్మలచెరువు వెళ్లే మార్గం అంతా చిల్లకంపను తన సొంత నిధులతో తొలగించడం జరిగింది .అంతేకాకుండా తెలుగులో వెనకబడ్డ పిల్లలందరికీ ప్రత్యేకమైన బుక్కును తయారుచేసి అందరికీ ఉచితంగా ఇవ్వడం గొప్ప విషయం. అలాగే విద్యార్థులకు విద్యా సామాగ్రి అనగా పలకలు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు ,స్టీల్ ప్లేట్లు గ్లాసులు ఇలా ఎన్నో రకాలుగా వారికి ఉచితంగా అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఎం అనూష అలాగే పాఠశాల చైర్మన్ తంగిరాల అనిల్ కుమార్ కూడా పాల్గొన్నారు.



