Listen to this article

ఐదు నెలల కమిషన్ రాక ఇబ్బందుల్లో రేషన్ డీలర్లు

కమిషన్ ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాo

పాపన్నపేట ఆగస్టు 25 (జనంన్యూస్)

తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పిలుపుమేరకు పాపన్నపేట మండలంలో రేషన్ డీలర్ల మండల అధ్యక్షుడు అర్కెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీలర్ల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయంలో తాసిల్దార్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది ముఖ్య సమస్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు సుమారు 17200 మంది మన తెలంగాణలో రేషన్ డీలర్లు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో పనిచేస్తున్నాము ఇట్టి రేషన్ షాప్ ద్వారా గత జూన్ జూలై ఆగస్టు మూడు నెలల సన్న బియ్యం ప్రభుత్వం షాప్ ల ద్వారా పేద ప్రజల లబ్ధిదారులకు అందించడం జరిగింది మరి అంతకంటే ముందు ఏప్రిల్ మే నెలల బియ్యం పంపిణీ కమిషన్ కూడా ప్రభుత్వం నుంచి డీలర్లకు అందలేదు మొత్తం ఐదు నెలల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లకు అందక రేషన్ డీలర్ల కుటుంబాలు పోషణన భా రమై అప్పు చేసుకుంటూ అప్పుల్లోకి కూరుకు పోతున్నామని ప్రతి డీలరు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భంలో రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు అన్ని మండలాల ప్రభుత్వ కార్యాలయం ఎమ్మార్వో ఆఫీస్ లలో మా డీలర్ల కమిషన్ కొరకై గోడు చెప్పుకుంటూ వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే కమిషన్ విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. మరియు ఎన్నికల సమయంలో డీలర్లను కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉంచుతామని మరి ప్రతి డీలర్ కు వేతన రూపంలో ఐదువేల రూపాయలు ప్రతి క్వింటాలుకు 300 రూపాయలు చొప్పున ప్రభుత్వం రాగానే ఈ విధంగా చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తున్న ప్రభుత్వం డీలర్ల హామీల ఉసే ఎత్తడం లేదు. లేక మరియు హెల్త్ కార్డులు ఇవ్వాలని. మరియు కరోనా సమయంలో చనిపోయిన డీలర్లకు ఎక్స్గ్రేషియా క్రింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలని. మరి డీలర్ ఆథరైజేషన్ శాశ్వత లైసెన్స్ గా గుర్తింపుని ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా డీలర్ల అందరూ డిమాండ్ చేయడం జరిగింది. మరి కమిషన్ తక్షణమే విడుదల చేయాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర పిలుపుమేరకు అధికారులకు తెలియజేయడం జరిగింది. ఈ మూడు నెలల సన్న బియ్యం ఓకే దఫాలుగా ప్రజ కార్డుదారులకు డీలర్లు 30 రోజులు నిరంతరం శ్రమించి ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. సుమారు 16 నుంచి 18 గంటల సమయం కేటాయించి ప్రతిరోజు బియ్యం పంపిణీ చేసి మరి ఈ ప్రభుత్వానికి మంచి కీర్తిని సంపాదించిపెట్టిన డీలర్లు. మరిఒక ప్రభుత్వ ఉద్యోగి ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తే మరి ప్రభుత్వం. డీలర్లతో వెట్టిచాకిరి చేపించుకుంటూ 18 గంటలు పని చేపించడం జరిగింది. కానీ డీలర్లకు కమిషన్ ఇవ్వకుండా మా కడుపు ఆకలి చావులను చూస్తుంది. కమిషన్ ఇప్పించేటట్లు ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఎమ్మార్వో గారిని కోరడం జరిగింది. ప్రభుత్వాలుమరియు డీలర్లను మాత్రం ఒక ప్రైవేటు గుమాస్తాగా చూస్తున్నారు తప్ప చెప్పుకోవడానికి మాత్రం ప్రభుత్వ చౌక ధరల దుకాణం అని ప్రభుత్వం చెప్పుకుంటుంది కానీ అందులో పని చేస్తున్న డీలర్లునూ మాత్రం ఒక ప్రైవేటు గుమాస్తగా చూస్తున్నారు ఈ ప్రైవేటు గుమస్తాలాగా కాకుండా , దళారీ వ్యవస్థ పోవాలని డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని. మరియు డీలర్లలో చాలామంది డీలర్లు ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్న వాళ్లను. ఇతరేత్ర ప్రభుత్వ కార్యాలయంలో పని చేయుటకు ఆదేశాలు ఇవ్వాలని గతంలో 10 సంవత్సరాల నుండి రాష్ట్రవ్యాప్తంగా మరియు అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా నిరసన లు నిర్వహించడం జరిగింది మరియు ఢిల్లీలో కూడా రాంలీల మైదానంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మా రేషన్ డీలర్ల డిమాండ్లను పరిష్కరించాలని దేశ ప్రభుత్వానికి కూడ వినతులను అందించడం జరిగింది. కావున మన ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ హామీలు అయితే డీలర్లకు ఇచ్చిందో అది తక్షణమే పరిష్కరించాలని రేషన్ డీలర్ తరఫున ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను కోరడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల మండల ఉపాధ్యక్షుడు ముశెట్టి కిష్టయ్య, నార్సింగ్ దశరథ్, ఏసు, పాపన్నపేట శంకరయ్య, కోడుపాక అప్సర్, కుర్తివాడ సిద్ధి రాములు, లింగం, లక్ష్మీ నగర్ రాజమణి మనోహర్ నాగ్సన్ పల్లి జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు