Listen to this article

జనంన్యూస్. 26.సిరికొండ.ప్రతినిధి.

నిజామాబాదు రూరల్ సిరికొండ కేంద్రం లోని కిడ్స్ పార్క్ స్కూల్ విద్యార్థులు చే పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు బదులుగా మట్టి వినాయకులనే వాడాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నేను సైతం అంటూ ముందుకొచ్చింది కిడ్స్ పార్క్ స్కూల్. సిరికొండ మండలంలో విద్యార్థులు స్వయంగా చేసిన వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సిరికొండ మండలంలో కిడ్స్ పార్క్ స్కూల్ విద్యార్థులు స్వయంగా చిట్టి చిట్టి చేతులతో బొజ్జ గణపయ్యలను తయారు చేసి పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పంపించేశారు. దానితోపాటు కాంగ్రెస్ డిసిసి ప్రధాన కార్యదర్శి వెలుమ భాస్కర్ రెడ్డి కి తాము చేసిన మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెలుమల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ. చిన్నపిల్లలు మట్టి గణపతులను చేసి పంపిణీ చేయడం పట్ల వారికి అభినందనలు తెలిపారు. విద్యార్థులు మట్టి వినాయకులను పూజించాలని అవగాహన కల్పిస్తూ మట్టి గణపతులను పంపిణీ చేయడం పట్ల పాఠశాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అనంతరం కరస్పాండెంట్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ చిన్నారులకు మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన కల్పించారు. వినాయక చవితి వస్తుందంటే పిల్లల సందడి మొదలవుతుంది. ప్రకృతికి అర్థం చెప్పే ఈ పండగ రోజున వినాయకుడి ప్రతిమని పూజించడం ఆనవాయితీ. అయితే రంగురంగుల వినాయకుడు అంటూ రసాయన విగ్రహాలు కాలుష్య కొరలుగా మారుతున్నాయి .నీరు, గాలి ,వాతావరణం కాలుష్యం కాకుండా పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల బదులుగా మట్టి వినాయకులనే వాడాలని కోరుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ ఆసిఫ్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.