జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 26 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
చిలకలూరిపేట పట్టణంలోని రైతు బజార్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకాన్ని నివారించడానికి మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్ రమణ రావు, రైతు బజార్ ఈవో షేక్ కాజాతో పాటు ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.పట్టణంలోని షాపుల్లో తనిఖీలు నిర్వహించి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తున్న వ్యాపారులకు జరిమానా విధించారు.శానిటరీ ఇన్‌స్పెక్టర్ రమణ రావు మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడే వారిపై తనిఖీలు కొనసాగిస్తామని, వారికి జరిమానా విధిస్తామని తెలిపారు. అంతేకాకుండా, దుకాణదారులు కొనుగోలుదారులకు జనపనారతో చేసిన జ్యూట్ బ్యాగులను అమ్మాలని, అలాగే కొనుగోలుదారులు తమ ఇంటి నుంచి చేతి సంచులను తెచ్చుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.ఈ డ్రైవ్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో ఒక భాగం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, పర్యావరణానికి మేలు చేసే ప్రత్యామ్నాయాలను వాడాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.


