Listen to this article

– విజయనగరం జిల్లా ఎస్పీ వకల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 28 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
కొత్తవలస మండలం మంగళపాలెంకు చెందిన బాలిక అదృశ్యం కేసును కొత్తవలస పోలీసులు కొద్ది గంటల్లోనే ఛేదించి, ట్రేస్ చేసిన బాలికను బంధువులకు అప్పగించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జనవరి 27న తెలిపారు.
వివరాల్లోకి వెళ్ళితే.. కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామానికి చెందిన వెలమ చరిష్మా (11సం.లు)
లక్కవరపు కోట ఎ.పి.మోడల్ స్కూలులో 5వ తరగతి చదువుతున్నారు. జనవరి 26న స్కూలులో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు గాను వెళ్ళి, వేడుకల అనంతరం తన స్నేహితురాలితో కలిసి జమ్మాదేవీపేటలోని
వారింటికి ఇంటికి వెళ్ళారు. సాయంత్రం వారింటి నుండి ఆర్టీసి బస్సులో బయలుదేరి మంగళపాలెం బస్టాప్ వద్దకు వచ్చి, ఒక మెడికల్ షాపు వద్ద నుండి తన తండ్రితో ఫోనులో మాట్లాడి, స్కూలు నుండి వచ్చేసినట్లుగా తెలపగా, అందుకు తండ్రి ఆమెను ఇంటికి వెళ్ళిమని చెప్పారు. అయినప్పటికీ, ఆమె సాయంత్రం వరకు ఇంటికి చేరక పోవడంతో ఆందోళన చెంది, కొత్తవలస పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా, పోలీసులు తక్షణమే స్పందించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు
ప్రారంభించారన్నారు.
కొత్తవలస సిఐ షణ్ముఖరావు తప్పిపోయిన బాలిక ఫోటోలను విశాఖపట్నం సిటీ పోలీసులకు పంపి, బాలికను వెతికే ఏర్పాట్లు చేసారు. అదే విధంగా ఎస్ఐ సుదర్శనరావుతో ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, బాలికను కనుగొనేందుకు చర్యలు చేపట్టారు. ఎస్ఐ సుదర్శనరావు అదృశ్యమైన బాలిక స్నేహితులు, మెడికల్ షాపు, తోపుడు బండ్ల వ్యాపారులను, స్థానికులను విచారణ చేసి, అదృశ్యమైన బాలికకు సంబంధించిన కొంత సమాచారం రాబట్టారు. అనంతరం, సిసి కెమెరాల ఫుటేజులను పరిశీలించి, బాలికను ట్రాక్ చేసి, పెందుర్తి వైపు వెళ్ళినట్లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు పెందుర్తి మరియు చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో బాలిక గురించి విచారణ చేపట్టి, చివరకు పెందుర్తి బస్టాప్ వద్ద చరిష్మా (11సం.లు)ను గుర్తించి, కొత్తవలస తీసుకొని వచ్చి, ఆమె బంధువులకు అప్పగించడంతో కథ సుఖాంతం అయ్యిందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
బాలికను ట్రేస్ చేసేందుకు చర్యలు చేపట్టి, అదృశ్యమైన కొద్ది గంటల్లోనే బాలికను ట్రేస్ చేసి, బంధువులకు
అప్పగించుటలో సమర్ధవంతంగా వ్యవహరించిన కొత్తవలస సిఐ షణ్ముఖరావు, ఎస్ఐ సుదర్శనరావు, మంగళపాలెం
ఎం.ఎస్.పి. గోకాడ లక్ష్మి, హెచ్.సి.మురళి, కానిస్టేబుల్ దేముడు మరియు ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.