Listen to this article

జుక్కల్ ఆగస్టు 26 జనం న్యూస్

ఇటీవల కాలంలో ప్యానల్ గ్రేడ్ హెచ్ఎం ప్రమోషన్లలలో మా బాల్య మిత్రుడు అయినటువంటి ఎస్ లాలయ్య గారికి ఖండేబల్లూర్ జడ్పిహెచ్ఎస్ లో పీజీహెచ్ఎం గా పదోన్నతి వచ్చినందుకు నేడు బిచ్కుంద హాస్టల్ లో చదివిన బాల్య మిత్రులందరు ఆనందోత్సవాల మధ్య శ్రీ లాలయ్య ను ఖండేబల్లూర్ జెడ్ పి హెచ్ఎస్ నందు ఘనంగా సన్మానించుకున్నారు లాలయ్య ప్రణాళిక బద్ధమైన వ్యక్తి చదువుని చక్కగా ఆస్వాదించే వ్యక్తి విద్యను అందించడంలో ఆయనకు ఆయనే సాటి ఆయనకు రారెవ్వరు పోటీ అని వక్తలు శ్రీ దస్థిరాం వైద్య బోధకులు అన్నారు, మట్టిలోని మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు, నీటిలోని చేప పిల్లలు వెలికి తీయడంలో ఆయనే దిట్ట అని అన్నారు ఆలస్యమైన విషo అమృతమైందని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ శాలువలతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది శ్రీ మారుతి పల్లెవార్ గారు, పెద్ద ఎక్లార నాగయ్య హెచ్ఎం వారి సిబ్బంది కూడా సన్మానించుకున్న వారిలో ఉన్నారు బాల్యమిత్రులు,
గాలయ్య,గంగారాం,హెచ్.విట్టల్, సుభాష్, సీతారాం, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు