విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్
జనం న్యూస్ 27 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జిల్లా పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తూ అనారోగ్యం లేదా ప్రమాదవసాత్తు మరణించిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలతో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆగస్టు 26న సమావేశమై,వారికి ప్రభుత్వం నుండి రావాల్సిన సర్వీసు బెనిఫిట్స్, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – జిల్లా పోలీసుశాఖలో వివిధ హెూదాల్లో పని చేస్తూ, అనారోగ్యం లేదా ప్రమాద కారణాలతో ఆకస్మికంగా మరణించిన పోలీసు ఉద్యోగుల కుటుంబ సభ్యులతో సమావేశమై, వారికి ప్రభుత్వం నుండి రావాల్సిన సర్వీసు బెనిఫిట్స్, వారి కుటుంబాల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు గురించి పోలీసు కార్యాలయ అధికారులు, పోలీసు కుటుంబాలతో జిల్లా ఎస్పీ చర్చించారు. మృతి చెందిన ఒక్కొక్క పోలీసు కుటుంబానికి పెండింగులో ఉన్న సర్వీసు బెనిఫిట్స్, ప్రస్తుతం వాటి స్థితి, ప్రగతి, కుటుంబంలో అర్హత కలిగిన వ్యక్తులకు కారుణ్య నియామకాలు చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు గురించి కార్యాలయ అధికారులను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఇటీవల మరణించిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు మినహా మిగిలిన వారికి అన్ని బెనిఫిట్స్ ను ఇప్పటికే అందజేయడం జరిగిందన్నారు. ఇంకనూ కొన్ని కుటుంబాలకు పెండింగులో ఎపిజిఎల్ఐ, జిఐఎస్, లీవ్ ఎన్ క్యాష్మెంట్, పెన్షన్, భద్రత ఎక్స్ గ్రేషియా వంటి బెనిఫిట్స్ మరణించిన పోలీసు కుటుంబాలకు త్వరితగతిన మంజూరు చేసేందుకు సంబంధిత అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.పెండింగులో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టేందుకు అర్హతలు కలిగిన వ్యక్తులు వెంటనే ధృవ పత్రాలను జిల్లా పోలీసు కార్యాలయంకు అందజేస్తే, కారుణ్య నియామకాలకు చర్యలు పడతామన్నారు. మరణించిన పోలీసు కుటుంబాలకు ఏ సందేహాలున్నా, సమస్యలున్నా లేదా సహాయం కావాలన్నా పోలీసు కార్యాలయ ఉద్యోగులను లేదా తనను నేరుగా సంప్రదించ వచ్చునన్న భరోసాను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కల్పించారు.ఇటీవల ట్రాఫిక్ పోలీసు స్టేషనులో విధులు నిర్వహిస్తూ పి.శ్రీనివాసరావు అనే హెూంగార్డు మరణించగా,వెల్ఫేర్ గ్రాంట్ గా మంజూరు చేసిన రూ.15 వేలు చెక్ ను ఆయన సతీమణి పి.లక్ష్మీ ప్రసన్నకు గార్కి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పోలీసు కార్యాలయంలో అందజేసారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డిపిఓ పరిపాలనాధికారి పి.శ్రీనివాసరావు, రిజర్వు ఇన్స్ పెక్టరు ఎన్.గోపాల నాయుడు, ఆఫీసు సూపరింటెండెంట్లు టి.రామకృష్ణ, వెంకటలక్ష్మి, ఆర్.ఎస్.ఐ. ప్రసాదరావు, పోలీసు అసోసియేషను అధ్యక్షులు కే.శ్రీనివాస రావు, జిల్లా పోలీసు కార్యాలయ ఉద్యోగులు, పోలీసు కుటుంబ సభ్యులు
పాల్గొన్నారు.


