Listen to this article

జనం ్యూస్ ఆగస్టు 28 కాట్రేనికోన

ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ పొట్టితిప్ప గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో గణపతి నవరాత్రుల సందర్భంగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి కమిటీ సభ్యులు గుడి అర్చక స్వామి పోతుల శ్రీను ఆధ్వర్యంలో పూజలు నిర్వహించినారు ఈ కార్యక్రమంలో గ్రామ కన్వీనర్ గడ్డం కృష్ణమూర్తి మాట్లాడుతూ గణపతిని పూజించడం వలన విఘ్నాలు పోయి సకల శుభాలు కలుగుతాయి అన్నారు ఈ విధంగా మండపాలు ఏర్పాటు చేసుకుని తొమ్మిది రోజులు ప్రజలందరూ ఐక్యమత్యంతో పూజలు నిర్వహించడం వలన అందరి మధ్య స్నేహభావం ఏర్పడుతుందన్నారు ఐ పోలవరం మండలం తిల్లకుప్ప అంబేద్కర్ కాలనీలో ఎస్ ఎస్ ఎఫ్ గ్రామ కన్వీనర్ తోటకూర బాబులురాజు రాచకొండ అచ్చిబాబు ల ప్రోత్సాహంతో విద్యార్థిని విద్యార్థులు గణపతి మండపం ఏర్పాటు చేసి పూజలు ప్రారంభించినారు. ఆలయ కన్వీనర్ సాధనాల పండు మెల్లం మురళి మోత రాజు శ్రీ జొన్నాడ దుర్గ యం. శ్రీరామ్ శంకర్ జొన్నాడ జగదీష్ గేల్లా కార్తీక్ కుమ్మరి విజయ్ మాత శంకర్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.