Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 28 కాట్రేనికోన

గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరైజేషన్‌ ప్రక్రియ వందశాతం పూర్తయ్యిందని కాట్రేనికోన డిసిసిబి మేనేజర్ పీతల శ్రీనివాస రావు పేర్కొన్నారు.మండల పరిధిలోని కందికుప్ప సొసైటీ కార్యాలయంలో చైర్ పర్సన్ నూకల మూర్తి అధ్యక్షతన కంప్యూటరైజషన్ గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి బిఎం శ్రీనివాస్ రావు మాట్లాడుతూ రాబోయే రోజులలో సొసైటీ కార్యక్రమాలు ఆన్ లైన్ లో జరుగుతాయన్నారు.సంఘం పరిధిలోని సభ్యులు మరణిస్తే అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయలు ఆర్ధిక సాయం చేయాలని రైతులు కోరారు.అలాగే సొసైటీలో అందిస్తున్న పౌర సేవలను ప్రజానీకం సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు.అనంతరం చైర్ పర్సన్ నూకల మూర్తి,సభ్యులు కాలాడి వీరబాబు,బొంతు శివశంకర్ ఆధ్వర్యంలో బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావుకి సన్మానం చేసారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సూపర్ వైజర్ పేర్నీడి జయశ్రీ,రైతులు నూకల కొండలరావు,దుర్గబాబు,తాడి బాబా సురేంద్రనాథ్,పాలెపు చిన సత్యం,సత్యానందం,గుద్దటి మంగారావు,నాగళ్ళ వాసు,గోనెమడతల మహేష్,సీఈఓ యర్రంశెట్టి రామచంద్రరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.