జనం న్యూస్ ఆగస్టు 28
కామారెడ్డి నిజాంబాద్ ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు పి రాములు నేత,రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ, సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు,మాదినం శివప్రసాద్ కార్యవర్గ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గత మూడు రోజుల నుండి ఏడోతెడుపు లేకుండా ఆకాశానికి చిల్లు పడినట్లు విస్తారంగా వర్షం కురుస్తుంది కాబట్టి అత్యవసరమైతే తప్ప వీలైనంతవరకు ప్రజలు సురక్షిత స్థలాల్లో ఉండాల్సిందిగా విద్యుత్ స్తంభాల దగ్గరికి కానీ చెట్ల దగ్గరికి గానీ చెరువు కుంటల దగ్గర కానీ వెళ్లరాదని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలని అధికారులు జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు నీట మునిగిన ప్రజలకు సురక్షిత స్థలాలకు చేర్చాల్సిందిగా వారికి అన్ని రకాలుగా ఆదుకోవాలని రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రజలకు మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాం అత్యవసరమైతే తప్ప వీలైనంతవరకు బయటికి రావద్దు ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు



