Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 28 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రతిజ్ఞ దినం.

స్థానిక ఎన్నార్టీ సెంటర్లో వాపక్ష నాయకులు తలపెట్టిన కార్యక్రమంలో నేడు విద్యుత్ చార్జీలపై బషీర్ బాగ్ లో జరిగిన మారణకాండ పై పలువురు నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో 2000 సం॥లో విద్యుత్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామిముగ్గురు అమరులై 25సం॥లు కావస్తున్నది.మరి ఎంతో మంది గాయాలయ్యాయి. ఆ ఉద్యమం ఫలితంగా దాదాపు 2 దశాబ్దాల పాటు విద్యుత్‌ చార్జీల పెంపుకు ఏ ప్రభుత్వం సాహసించలేదు. కానీ గత వైసిపి ప్రభుత్వం సంస్కరణల పేరుతో ప్రజలపై వేసిన వేలాది కోట్ల భారాలను రద్దు చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అదే విధానాలను కొనసాగిస్తున్నదని తెలిపారు. గత ప్రభుత్వం ప్రారంభించిన అదాని కంపెనీ స్మార్ట్‌ మీటర్లను ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నది. ఫలితంగా ప్రత్యేకించి పేద, మధ్యతరగతి ప్రజలు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. కావున ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిజ్ఞాదినంగా పాటిస్తున్నారని, దానిలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట విద్యుత్ చార్జీల పైప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, తో పాటు పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.