Listen to this article

జనం న్యూస్ ఆగష్టు 28 జగిత్యాల జిల్లా

బీర్పూర్ మండల కేంద్రములో అకాల వర్షానికి రోళ్ళావాగు మెయిన్ కెనాల్ యూటీకి రంద్రం పడి పోలాలు మరియు ఇండ్లలోకి నీళ్ళు వస్తున్నాయని విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లి పరిశీలించి అధికారులతో మాట్లాడిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నగా ఉన్న బీర్పూర్ రోల్ల వాగు చెరువును బిఆర్ఎస్ హయాంలో పెద్ద గా చేసి అన్ని పనులు పూర్తి చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఒక షట్టర్ బిగించలేక నీళ్లని వృధాగా పోతున్నాయని అన్నారు.సాగు నీటికి తగు నీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని గత పాలకులకు రాని ఆలోచన బిఅర్ఎస్ ప్రభుత్వం కి వచ్చిందని అన్నారు మెయిన్ కెనాల్ యూటి కి రంధ్రం పడి ఇండ్ల లోకి మరియు పొలాల్లోకి వరదలు వచ్చి రైతుల పొలాల హద్దులు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని వెంటనే యూటి మరమ్మతులు ప్రారంభించలని అన్నారు.రోల్ల వాగు ప్రాజెక్ట్ కి ఒక శెట్టర్ బిగిస్తే నీళ్లను నిల్వ చేసుకోవచ్చని, ఇప్పుడు నీళ్ళు అన్ని వృధాగా పోతున్నాయని అన్నారు. పొలాలు నాటు వేసే సమయంలో నీళ్లు సమయానికి అందక నార్లు ముదిరిపోయాయని ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నీళ్ళు నిల్వ చేసి వాడుకునే పరిస్థితి లేదని అన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి శెట్టర్ బిగించాలని రైతుల మరియు బిఅర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వనీ డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు సరియైన సమయనికి నీళ్లు మరియు ఎరువుల అందించడంలో విఫలమైందని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్తారని అన్నారు.గోదావరి నది పరివాహక ప్రాంత అయిన రంగసాగర్ మంగెల కమ్మునూరు రేకులపల్లి చిత్ర వేణు గూడెం గ్రామాల్లో చాలా మేరకు పంట నష్టం జరిగిందని ప్రభుత్వం వెంటనే పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొలుముల రమణ నాయకులు సతీష్ శ్రీనివాస్ లక్ష్మీ నారాయణ రాజేశం రామ చంద్ర తిరుపతి మహేందర్ జితేందర్ తిరుపతి సుదర్శన్ రాజేందర్ రైతులు తదితరులు ఉన్నారు.