

జనం న్యూస్ ఆగస్టు 28:
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి వర్షాలు పడుతున్నాయి కావున ప్రజలు అప్రమత్తం గా ఉండాలనీ తహశీల్దార్ మల్లయ్య, ఎస్సై పడాల రాజేశ్వర్, ఎంపీ వో శివ చరణ్ సూచించారు.గురువారము రోజునా తడ్పాకల్ గోదావరి నదిప్రవాహం ను పరిశీలించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ తడ్పకాల్, గుమ్మిర్యల్, దోంచంద గ్రామాల ప్రజలు రాబోవు రెండు మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నందున మరియు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు వరద నీరు ఎక్కువగారావడంతో మొత్తం గేట్లనుఎత్తివేయడం తో గోదావరినది ప్రవాహం ఎక్కవగా వస్తుంది కావున ఈ గ్రామాలు గోదావరి నది ఒడ్డున ఉన్నందున ప్రాజెక్టు గేట్ల నుండి వస్తున్న వరద నీరు వల్ల గోదావరి నది రెండు గడ్డలకు ఆనుకొని ప్రవహిస్తున్నది. దీనికి తోడు పెద్దవాగుకూడా ప్రవహించి గోదావరి నదిలో కలుస్తున్నది కావున గోదావరి వరద ప్రవాహము ఎక్కువ ఉన్నది. కావున ఇట్టి గ్రామాల ప్రజలు పశువుల కాపర్లు గొర్ల కాపర్లు మత్స్యకారులు ఎవరు కూడా గోదావరి నదిలోకి వెళ్ళకూడదు. ఒకవేళ ప్రజలు వెళ్లినట్టు అయితే ప్రాణాలకు ప్రమాదము ఉన్నది. అంతేకాకుండా మండలంలోని ప్రజలు మరియు చుట్టుపక్కల మండలాల ప్రజలు ఇట్టి గోదావరి నది ప్రవాహం వద్దకు రకరకాల మొక్కలు తీర్చుకొనుటకు వస్తున్నట్లు తెలిసినది. కావున రానున్న వారం రోజులు మండలంలోని ప్రజలు గాని ఇతర మండలాల ప్రజలు గాని గోదావరి నదిలో ఎలాంటి మొక్కులు తీర్చుకొనుటకు రాకూడదని తెలిపారు. గ్రామాలలో ప్రజలు పాత మట్టి గోడల ఇండ్లలో ఉండకూడదని తెలియజేయజేశారు .గోదావరి అవతల ఉన్న పొలాలకు చెందిన రైతులు కూడా వారి పొలాల వద్దకు వెళ్లకూడదు .వ్యవసాయ పొలాల కాడికి వెళ్లేటప్పుడు కరెంటు తీగలు తెగిపడి ఉంటాయి జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్లగలరు. కరెంటు స్తంభాలు తడిసి ఉంటాయి కావున ప్రజలు ఎవరు కూడా కరెంటు స్తంభాలు వర్షం పడినప్పుడు ముట్టుకోవద్దు. వర్షముల వలన ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగిన వెంటనే ఎమ్మార్వో, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎంపీడీవో, ఎంపీవో, మండల రెవెన్యూ పరిశీలకులు మరియు మీ యొక్క గ్రామ పంచాయతీ కార్యదర్శికి తెలియజేసినట్లయితే వెంటనే సహాయ చర్యలు ప్రభుత్వం తరఫున తీసుకుంటాము.కాబట్టి మండలంలో ఉండే ప్రజలందరూ అతి జాగ్రత్తగా రాబోవు రెండు మూడు రోజులు వాగుల వద్దకు చెరువుల వద్దకు పెద్ద కాలువల వద్దకు వెళ్లకూడదు అని తెలిపారు. వీరితో పాటు స్థానిక ఎస్సై పడాల రాజేశ్వర్, పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.