Listen to this article

శ్రీ శ్రీ శ్రీ సౌమ్యనాథ్ స్వామి ఆలయం నందు నందలూరు మండల జనసేన పార్టీ నాయకుల చేతుల మీదగా పోస్టర్స్ ఆవిష్కరణ.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

విశాఖపట్నంలో ఈ రోజు 28,29,30వ తేదీలలో జనసేన పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘సేనతో సేనాని’ కార్యక్రమాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.“సేనతో సేనాని” కార్యక్రమం ద్వారా గ్రామస్థాయి వరకు పార్టీ బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని, ప్రతి ఇంటికి పార్టీ సిద్ధాంతాలను చేరవేయడం, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.నందలూరు మండల జనసేన పార్టీ నాయకులు కేదర్నాథ్ గురివిగారి వాసు,హోటల్ శివ,అరుణ్ పాండే, మస్తాన్, ఎల్,రాము మండెం, ప్రకాష్, ప్రతాప్, హరీష్,అజయ్ చిన్ను,సుబ్బు,జితేంద్ర,రవి తదితరులు పాల్గొన్నారు.