

జనం న్యూస్ ఆగస్టు 28 అమలాపురం
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా అమలాపురం కి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు నల్లా పవన్ కుమార్ నియమితులయ్యారు. గురువారం పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన లిస్టులో ఆయన పేరు ఉంది. ఆయన ఇప్పటి వరకు జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గా పని చేశారు. రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సారధ్యంలో డా.బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రాష్ట్ర పదాధికారిగా నల్లా పవన్ కు చోటు దక్కింది. ఈ సందర్బంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారు, రాజ్యసభ ఎంపీ పాకా సత్యనారాయణ గారు, మాజీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు, జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ గారు, జాతీయ కౌన్సిల్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా గారు, రాష్ట్ర 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకరన్ గారు మరియు పలువురు పార్టీ నాయకులు అభిమానులు నల్లా పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు.