Listen to this article

మద్నూర్ ఆగస్టు 29 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సహాయక బృందాలు, వాలంటీర్లు, కార్యకర్తల సహకారంతో ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించిన విషయం తెలిసిందే. తాత్కాలిక పునరావాస కేంద్రాలుగా ఏర్పాట్లు చేసిన మద్నూర్ మరియు డోంగ్లీ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి బాధితులను ఎమ్మెల్యే గారు పరామర్శించారు.. అక్కడ ఏర్పాట్లు, సౌకర్యాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు..అత్యవసర పరిస్థితుల్లో కట్టుబట్టలతో వచ్చిన మహిళలు మార్చుకోవడానికి బట్టలు లేని పరిస్థితిని తెలుసుకొని అప్పటికప్పుడు చీరలు తెప్పించి వారికి అందించారు.
ఎవరికి ఏ సమస్య ఉన్నా, ఏదైనా కావాల్సి ఉన్నా తమకు తెలియజేయాలని చెప్పారు.ప్రజల భద్రత, క్షేమమే తమకు ముఖ్యమని ఎమ్మెల్యే తెలిపారు..ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వారికి కావాల్సిన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు..ఈ తాత్కాలిక పరిస్థితికి ఎవరూ చింతించవద్దని, ప్రభుత్వం ఆదుకుంటుంది, నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండి అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే బాధితులలో ఆత్మస్థైర్యాన్ని నింపారు..అనంతరం ఎమ్మెల్యే బాధితులకు తానే స్వయంగా బోజనాలు వడ్డించారు..