Listen to this article

జనం న్యూస్ ఆగస్టు(29)

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం బక్క హేమ్లతండ పంచాయతీ భవనాన్ని 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి ఇప్పటివరకు ప్రారంభించకపోవడంతో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు శుక్రవారం నాడు గ్రామపంచాయతీ భవనం ముందు కూర్చోని నిరసన వ్యక్తం చేసినారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నెహ్రు నాయక్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరై భవనం అన్ని అంగుళాలతో పూర్తయినదని కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రారంభించకపోవడం బాధకారం ఏమన్నారు. ప్రభుత్వ భవనం అందుబాటులో ఉన్న అద్దె భవనంలో గ్రామపంచాయతీ నిధులు నిర్వహించడం సరైంది కాదన్నారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ రెండుసార్లు తేదీలు నిర్ణయించినప్పటికీ స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డుకొని ప్రారంభోత్సవాన్ని నిలిపివేయించినట్లు ఆరోపించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందున ప్రజల సౌకర్యార్థం నూతన భవనం ప్రారంభించేలా జిల్లా కలెక్టర్ మరియు ఉన్నత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో గ్రామస్తులతో కలిసి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో,ఎంపీడిఓ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు గుగులోతు వ వస్రం నాయక్,లింగ నాయక్ నాగరాజు నాయక్,సోషల్ మీడియా మండల కోఆర్డినే నాగు నాయక్, శంకర్ నాయక్, నరసింహ నాయక్,నవీన్ నాయక్,విష్ణు తదితరులు పాల్గొన్నారు.