Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 29 ముమ్మిడివరం ప్రతినిధి

ఈరోజు కే జగన్నాధపురం గ్రామంలో ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ జి సూర్య కుమారి గారి ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గిడుగు వెంకట రామమూర్తి గారి చిత్రపటానికి మేజర్ దయాన్ చంద్ గారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు ఆ తర్వాత స్కూల్ హెడ్ మాస్టర్ స్కూల్ చైర్మన్ అంకం నాగమల్లేశ్వరరావు స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు గని శెట్టివెంకటేశ్వర్రావు (బాబీ మాస్టారు) ఉపాధ్యాయులు తెలుగు పండితులు విత్తనాల సూర్య నారాయణ మాస్టర్ కి మల్లాడి కామేశ్వరి మేడం గారికి ఘనంగా సన్మానించారు ఉపాధ్యాయులు మాట్లాడుతూ మన మాతృభాష తెలుగు యొక్క గొప్పతనాన్ని భావితరాలకు అందేలా వాడవాడలా వ్యాప్తి చెందేలా మనమందరము కృషి చేయాలని విద్యార్థిని విద్యార్థుల ఉద్దేశించి తెలుగు భాష అభివృద్ధికై ఉద్యమంలో కృషిచేసిన మహానుభావుల చరిత్రలో చదవాలని అన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ పద్మజ స్కూల్ చైర్మన్ మిద్దెనూతన రవిరాజు నల్ల పల్లం రాజు బల్లసర్వేశ్వరరావు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు