

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
భక్తులకు అన్నప్రసాదం పంపిణి కార్యక్రమాన్ని సర్పంచ్ జంబు సూర్య నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. శుక్రవారం నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ లోని స్వామి వివేకానంద నగర్ లో మేస్త్రి గోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక ఉత్సవాల్లో భాగంగా సర్పంచ్ జంబు సూర్య నారాయణ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సర్పంచ్ సూర్యనారాయణ ను ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సత్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు నాగేంద్ర ఆదినారాయణ.మరియు అరిగే హరిబాబు ధనుంజయ నాయుడు హనుమంతు పవన్ కుమార్ జయరాం రెడ్డి బలరాం మెహర్ శివ నరసింహులు శ్రీనివాసులు తెరవాకులు పెద్ద ఎత్తున ప్రజలు భక్తులు పాల్గొన్నారు.
