Listen to this article


జనం న్యూస్ ఆగస్టు 29: నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల మండలములో బారి వర్షాలు పడటంతో పాటు పోచంపాడ్ ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల వల్ల మండల గోదావరి గంగా పరివారక ప్రాంతమైన తడ్పకల్, దోంచంద, గుమ్మిర్యాల్ గ్రామాలను పరిశీలించిన్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్ అన్నారు. వేసిన పంటలు వరదల వల్ల చాలా నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదేశానుసారం వరదలు తగ్గిన తర్వాత అధికారులు పంట నష్టం అంచనా వేసి నివేదికలను ప్రభుత్వానికి పంపటం జరుగుతుందని. నివేదిక ప్రకారం నష్ట పరిహారం రైతులకు అందే విధముగా ప్రభుత్వ దృష్టికి తీసుకవెళ్లి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. గత మూడు రోజుల నుండి మండల అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఎలాంటి నష్టం జరగకుండా సూచనలు చేస్తూ కృషి చేసినారు, ఇంకా వర్ష సూచన ఉన్నందున నిర్లక్ష్యం చెయ్యకుండా ఇప్పటికైనా ప్రజలు జాగ్రతగా ఉండాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ విజ్ఞప్తి చేశారు.