

జనం న్యూస్ ఆగష్టు 30
ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ లో రౌడీ షీటర్లు,పలు కేసుల్లోని నేరస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు అండగా ఉండేందుకే పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.అందరూ చట్టాలను గౌరవించి మెలగాలన్నారు.తాత్కాలిక సుఖం కోసం చెడు అలవాట్లకు లోనై కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతూ తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ శ్రీధర్ రెడ్డి,సీఐలు చరమందరాజు, ప్రతాప లింగం, శివ శంకర్ నాయక్,ఎస్ఐలు పాల్గొన్నారు.

