

జనం న్యూస్,ఆగస్టు 30,అచ్యుతాపురం:
మండలంలోని తిమ్మరాజుపేట మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ గ్రామ సర్పంచ్ శరగడం భాగ్యలక్ష్మి శివ బాపునాయుడు చేతుల మీదగా శనివారం స్టీల్ వాటర్ బాటిళ్లు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శివ బాపునాయుడు మాట్లాడుతు కాలుష్య కారకమైన ప్లాస్టిక్ బాటిల్ కంటే పర్యావరణ సహిత స్టీల్ వాటర్ బాటిల్ వాడడం ఆరోగ్యకరం అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మారిశెట్టి వెంకట అప్పారావు,అంగన్వాడీ కార్యకర్త భారతి, ఆయా రూప, ఆలేటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.