

జనం న్యూస్ 30 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
అహ్మదాబాద్‌లో జరుగుతున్న కామన్ వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారుడు సత్తా చాటాడు. నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన అజయ్ 79 కిలోల విభాగంలో గురువారం పాల్గొని బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు, గ్రామస్థులు అజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.