Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

మొదటి బహుమతి కైవసం చేసుకున్న కవిత

నందలూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లి లోని జూనియర్ సివిల్ కోర్టు వద్ద ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 32 వ వార్షికోత్సవం సందర్భంగా వినాయకుని విగ్రహం వద్ద శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన రంగవల్లుల పోటీలు అలరించాయి. ఈ పోటీలలో కవిత ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని ప్రెజర్ కుక్కర్ ని, ఎంబలూరు కళ్యాణి ద్వితీయ స్థానంలో నిలిచి హాట్ బాక్స్, నారాయణమ్మ తృతీయ స్థానంతో వాటర్ ప్యూరిఫైడ్ ను కైవసం చేసుకున్నారు. పోటీలలో పాల్గొన్న వారందరికీ కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. న్యాయ నిర్ణయితలుగా డాక్టర్ శ్రీ వాణి, వైఎస్ఆర్సిపి మహిళా మండల అధ్యక్షురాలు పల్లె మాధవి లు వ్యవహరించారు. ఆకేపాటి జగదీశ్వర్ రెడ్డి,వల్లంకొండు శివకుమార్,మేడ వెంకట కుమార్, గీత,కృష్ణ,నారాయణ,గండికోట శివకుమార్,మురళి,నారాయణ శెట్టి, సుమ,జ్యోతి,లక్ష్మి,పద్మజ, అఖిల,విజయ తదితరులు పాల్గొన్నారు.