

వైసీపీ నేత, వైసీపీ స్టేట్ యూత్ విభాగం సెక్రటరీ నెమలిదిన్నెచెన్నారెడ్డి.
బేస్తవారిపేట ప్రతినిధి, ఆగష్టు 30 (జనం న్యూస్):-
ఏపీ: రుషికొండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డ్రామాలాడారని వైసీపీ నేత, నెమలిదిన్నె చెన్నారెడ్డి మండిపడ్డారు. సీలింగ్ కట్ చేసి, అక్కడ ఫొటోలు దిగారని ఆయన ఆరోపించారు. ‘రుషికొండ భవనాలను వాడుకునేందుకు చంద్రబాబు, పవన్, లోకేశ్ పోటీపడుతున్నారు. చంద్రబాబు రూ.200 కోట్లతో హైదరాబాద్ లో ఇల్లు కడితే అది పూరి గుడిసె. కానీ జగన్ ఇల్లు కట్టుకుంటే మాత్రం అది ప్యాలెసా ‘ అని వైసీపీ నేత నెమలిదిన్నె చెన్నారెడ్డి ఫైర్ అయ్యారు.