

జనంన్యూస్. 31. సిరికొండ. ప్రతినిధి.
సీఎం రేవంత్ రెడ్డి కి నిజామాబాద్, రూరల్ నియోజకవర్గం లో సిరికొండ. ధర్పల్లి. వరద నష్టం గురించి వివరించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. స్పందించిన సీఎం. వరద నష్టం ఎంత జరిగిందో అంచనా వేయాలని కలెక్టర్ కు సిఎం ఆదేశాలు. హైదరాబాదులో శాసనసభ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి కలవడం జరిగింది.నిజామాబాద్ జిల్లాలో జరిగిన వరద నష్టం గురించి సీఎం రేవంత్ రెడ్డికి వివరించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి తో నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ రూరల్ నియోజవర్గంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షం వల్ల పంటలు, రోడ్లు, విద్యుత్, కరెంటు స్తంభాలు, బ్రిడ్జ్ లు ఎంత నష్టం జరిగిందో సీఎంకు వివరించడం జరిగిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి తెలిపారు. అలాగే పంచాయతీరాజ్ శాఖ వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ, రోడ్ల భవనాలు శాఖ లు సమన్వయంతో పనిచేసి నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ రూరల్ నియోజవర్గంలో ఎంత వరద నష్టం జరిగిందో అంచనా వేసి సీఎంకు పంపాలని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి రూరల్ నియోజకవర్గంలో జరిగిన ఆస్తి నష్టం, పంట నష్టం, రోడ్లు కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫర్ లు ధ్వంసం గురించి సీఎంకు వివరించారు. సిఎం సానుకూలంగా స్పందించి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు అన్ని శాఖల సమన్వయంతో వరద వల్ల పూర్తి నష్టాన్ని అంచనాలు వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారని ఆయన అన్నారు. సీఎం జిల్లాలో జరిగిన వరద నష్టం పై కలెక్టర్లతో రివ్యూ చేస్తున్నారని .రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు.