

ఘనంగా ఏ ఓ పదవి విరమణ కార్యక్రమం
కాట్రేనికోన ఆగష్టు 31 జనం న్యూస్
విధి నిర్వహణలో ఉద్యోగులు ప్రజలకు చేసిన సేవలు ఉద్యోగులకు తగిన గుర్తింపుని ఇస్తాయని కాట్రేనికోన ఎంపీపీ కోలాటి సత్యవతి పేర్కొన్నారు. కాట్రేనికోన మండల పరిషత్ కార్యాలయం నందు పరిపాలనాధికారిగా పనిచేస్తూ ఈనెల 31వ తేదీ ఆదివారం పదవి విరమణ చేయనున్న ఎం హెచ్ ఆర్ శ్రీనివాసరావు సన్మాన కార్యక్రమం శనివారం కాట్రేనికోన ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న గ్రంధి నాగేశ్వరరావు కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో ఎస్ వెంకటాచలం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జడ్పిటిసి నేల కిషోర్ మాట్లాడుతూ ఏవోగా విధులు నిర్వహించిన శ్రీనివాసరావు చాలా సౌమ్యుడని, తన పని తాను చేసుకుంటూ ఇతరులను నొప్పించకుండా అందర్నీ కలుపుకుపోయే మనస్తత్వం కలిగిన వ్యక్తిని ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు శ్రీనివాస రావు చేసిన సేవలను కొనియాడారు. ఆయన శేష జీవితం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. పదవి విరమణ రోజున ముందుగా పెన్షన్ శాంక్షన్ ఆదేశాలు రావడం చాలా సంతోషమని ఎంపీడీవో ఎస్. వెంకటాచలం తెలిపారు. పెన్షన్ ఆదేశాలను ప్రజా ప్రతినిధులు చేతులు మీదుగా శ్రీనివాసరావుకు అందజేశారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు, కుటుంబ సభ్యులు ఎం హెచ్ ఆర్ శ్రీనివాసరావు దంపతులను దుస్సాలు వాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు నేల కిషోర్ కుమార్, ఎంపీపీ కోలాటి సత్యవతి సత్యం, స్థానిక సర్పంచ్ గంటి వెంకట సుధాకర్, వంకా ఏడుకొండలు, దంతులూరి సీతా రామ కృష్ణం రాజు, మల్లాడి వీర బాడ్జి, వైసీపీ మండల కన్వీనర్ నల్లా నరసింహమూర్తి, ఎంపీడీవో ఎస్ వెంకటాచలం, తాసిల్దార్ సుబ్బలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీవో మమత, ఆర్డబ్యూఎస్ జేఈ సుబ్రహ్మణ్యం, ఉపాధి హామీ ఏపీ ఓ చంద్రమోహన్, ఏపీఎం శ్రీనివాసరాజు, ఎం ఈ ఓ వెంకటరమణ, ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ లంకే వెంకట రమణి, ఎంపీటీసీ సభ్యులు బీర ధనంజి, పంచాయితీ కార్యదర్శులు కె వి వి సత్యనారాయణ, ఎం టి వి వర్మ, పి రామారావు, విత్తనాల వెంకటరమణ, జే కిరణ్, భాగయ్య, ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, పంచాయతీ
