

కుమార్ మృతదేహం పక్కన భార్య రేణుక.
జనం న్యూస్ 01 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా.
వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం కేసారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. బంట్వారం మండలం రొంపల్లి గ్రామానికి చెందిన కురువ కుమార్ (36), రేణుక (34) భార్యభర్తలు కేసారం గ్రామంలోని ఒక వెంచర్లో పని చేస్తున్నారు. రోజూ మద్యం తాగి భార్యను వేధిస్తున్న కుమార్, ఆదివారం రోజు కూడా మద్యం మత్తులో వచ్చి భార్యను తిట్టుతూ “చంపేస్తా” అని బెదిరించాడు. ఇక భరించలేని స్థితికి చేరుకున్న రేణుక, కోపంతో భర్త కుమార్ కళ్లలో కారం చల్లి, కేబుల్ వైర్‌తో గొంతుకు బిగించి చంపేసింది. ఈ ఘటనతో మండలంలో తీవ్ర సంచలనం రేగింది. దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మోమిన్ పేట ఎస్ఐ అరవింద్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. తానే కుమారుని హత్య చేసినట్లు రేణుక ఒప్పుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.