

జనం న్యూస్ సెప్టెంబర్ 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా బీసీలకు 42% శాతం రిజర్వేషన్ కల్పించినా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంఘం రాష్ట్ర నాయకులు జర్నలిస్టు హరికృష్ణ మాట్లాడుతూ దేశ చరిత్రలో తొలిసారిగా పార్టీలకు అతీతంగా 42% శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు ఆర్డినెన్స్ శాసనసభలో తీర్మానం చేసి గవర్నర్ కు పంపినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాము. అలాగే కేంద్రంలో బిల్లు ఆమోదించే వరకు ఏ పార్టీలు కూడా రాజకీయాలు చేయొద్దని బీసీలకు మద్దతుగా అన్ని పార్టీలు నిలవాలన్నారు. 42% బీసీ బిల్లుకు ఆమోదం తెలిపినటువంటి టిఆర్ఎస్ పార్టీకి, బిజెపి పార్టీకి, సిపిఐ పార్టీకి, ఎంఐఎం పార్టీ అందరికీ బీసీల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ అన్నారు.