

జనం న్యూస్. తర్లుపాడు మండలం. సెప్టెంబర్ 3
వైయస్ రాజశేఖర్ రెడ్డి 16 వ వర్ధంతి సందర్భంగా మార్కాపురం నియోజవర్గ వైయస్సార్ సీపీ పార్టీ మార్కాపురం నియోజక వర్గం ఇన్చార్జి అన్నా వెంకట రాంబాబు తర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పూలమాలవేసి నివాళులు అర్పించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజ్ రియాంబర్స్ మెంట్, ఉచిత కరెంట్, రుణమాఫీ వంటి సంక్షేమ పధకాలను ప్రవేశ పెట్టి పేద ప్రజలు, రైతులు మన్ననలు పొంది ప్రజల గుండెల్లో చిరస్తాయిగా నిలిచిన మహానేత అని అన్నారు అనంతరం . అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్ మురారి వెంకటేశ్వర్లు, సూరెడ్డి సుబ్బారెడ్డి,కోఆప్షన్ సభ్యులు షేక్ అక్బర్ అలీ, మాజీ సొసైటీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.