

జనం న్యూస్ సెప్టెంబర్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం గ్రామ వ్యాప్తంగా యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులలో సోమవారం రాత్రి యూరియా వచ్చింది మంగళవారం ఉదయం పంపిణీ చేస్తారని తెలుసుకున్న మండలం లోని వివిధ గ్రామాల రైతులు ఉదయం ఫర్టిలైజర్ షాపులకు బయలు దేరి ఒక బస్తా యూరియా కోసం రోజంతా పని వదులుకొని క్యూలో నిలబడి నరకయాతన పడుతున్నారు అయినప్పటికీ బస్తా యూరియా దొరకడం గగనంగా మారింది గంటల తరబడి నిలబడి ఒక్కరికీ ఒక బస్తా మాత్రమే పంపిణీ చేశారు కొంతమంది రైతులకు యూరియా అందకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు రైతులకు సరిపడా యూరియా దిగుమతి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు…..