

సహకార సంఘం కార్యాలయం ముందు రైతులు ధర్నా.
కార్యాలయం కు తాళం వేసిన రైతులు.
జూలూరుపాడు,03 సెప్టెంబర్,జనం న్యూస్ : మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నందు రైతులు యూరియా కొరత ఉండటంతో ఆందోళన చేపట్టి రైతులు సహకార సంఘం సిబ్బందిని కార్యాలయంలో ఉంచి తాళం వేసి ఒక్కొక్క రైతుకు కనీసం మూడు కట్టలు యూరియా ఇవ్వాలని ఒక రైతుకి ఒక కట్ట యూరియా ఇస్తే ఎలా సరిపోతుందని నిరసన తెలుపుతూ సిబ్బందిని నిర్బంధించారు.విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సహకార సంఘం కార్యాలయం వద్దకు చేరుకొని రైతులకు నచ్చచెప్పి యాదవిగా సహకార సంఘం కార్యాలయం తాళం తీసి యధావిధిగా సహకార సంఘం కార్యకలాపాలు సిబ్బంది చేపట్టారు.సొసైటీ సిబ్బందిని వివరణ కోరగా జూలూరుపాడు సొసైటీ పరిధిలోని 40 టన్నుల యూరియా అవసరమని ఆర్డర్ పెట్టగా పది టన్నుల యూరియానే వచ్చిందని, వచ్చిన యూరియానీ ఒక్కోక్క రైతుకు ఒక్క యూరియా కట్ట ఇస్తున్నామని తెలిపారు.ఈ సందర్భంగా కొందరు రైతులు మాట్లాడుతూ చాలి చాలని యూరియా కోసం ఉదయం నుండి తిండి తిప్పలు లేకుండా లైన్లో నుంచొని ఒక్క యూరియా తీసుకోవడానికి నానా కష్టాలు పడుతున్నామని వెంటనే అధికారులు రైతులకు కావలసిన యూరియా కావలసినంత అందేవిధంగ చర్యలు తీసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.